జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మున్సిపల్ కార్మికులను సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలతో
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్,
కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్గాలు హెచ్చరించాయి.