
‘ఇందిరా నగర్ కా గూండా చాలా స్వీట్’.. ద్రవిడ్ వీడియో వైరల్
భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ తన నిరాడంబరతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన సోదరీమణులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు ద్రవిడ్‌ను చూసి ఆటోగ్రాఫ్ కోరగా, ఆయన ఎంతో ఆత్మీయంగా ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆ యువకుడు ఆ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ 'ఇందిరానగర్ కా గూండా.. నిజ జీవితంలో చాలా స్వీట్' అని వ్యాఖ్యానించాడు. విమానాశ్రయం నుంచి ద్రవిడ్ బస్సు ఎక్కే వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




