ఏపీలో 'జైలర్‌ 2' టికెట్‌ ధరల పెంపు

34చూసినవారు
ఏపీలో 'జైలర్‌ 2' టికెట్‌ ధరల పెంపు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్