‘జైలర్’లో విలన్ల భరతం పట్టిన టైగర్ ముత్తువేల్ పాండియన్.. గాడ్జిల్లాతో తలపడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఓ నెటిజన్ ఏఐ వీడియో రూపొందించారు. ‘జైలర్ 5’లో రజనీకాంత్ వర్సెస్ గాడ్జిల్లా అంటూ సృష్టించిన ఈ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటు సినిమా అభిమానులను, ఇటు నెటిజన్లను ఈ ఏఐ సృష్టి ఆకట్టుకుంటోంది.