రానున్న నెలల్లో ప్రపంచం భారీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-గల్ఫ్ ఘర్షణల ప్రభావంతో ధాన్యాల రవాణాలో అంతరాయాలు, ఎరువుల కొరత పెరుగుతున్నాయని తెలిపారు. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక వ్యవస్థ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఈ పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.