
రోడ్డుపై కర్రలతో దాడి చేసుకున్న విద్యార్థులు (వీడియో)
గ్రేటర్ నోయిడాలోని GNIOT కాలేజీ వద్ద రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదంతో మొదలైన ఈ గొడవలో విద్యార్థులు కర్రలు, స్టూళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘర్షణ కారణంగా రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ, వైరల్ వీడియోల ఆధారంగా విద్యార్థులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘర్షణ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.




