జపాన్ మహిళపై యోగా సెంటర్ ఓనర్ అత్యాచారం

7చూసినవారు
జపాన్ మహిళపై యోగా సెంటర్ ఓనర్ అత్యాచారం
కేరళంలోని తిరువనంతపురం జిల్లా వర్కలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ కోసం జపాన్ నుంచి ఓ మహిళ(57) వర్కలకు వచ్చింది. యోగా సెంటర్ ఓనర్ చాకలి నరేష్ (37) ఆమెపై లైంగిక దాడి చేశాడు. అక్టోబర్ 28న మసాజ్ చేస్తానని చెప్పి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 30, 31వ తేదీల్లోనూ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కోర్సు సర్టిఫికెట్ కోసం మొదట్లో మౌనంగా ఉన్నానని, కానీ అతని వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది. పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్