
గురహోంగార్డు దారుణ హత్య.. ముగ్గురు అరెస్ట్
AP: పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడుకు చెందిన హోంగార్డు షేక్ అలేఖ ఈ నెల 14న కనిపించకుండాపోయి మృతదేహంగా మారాడు. విచారణలో అలేఖకు రమాదేవితో ఉన్న వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీల గొడవల వల్ల ఈ హత్య జరిగినట్లు తేలింది. రమాదేవి తన స్నేహితులు శ్రీకాంత్, మల్లికార్జునతో కలిసి అలేఖను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసి, అతన్ని హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.




