జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీని ఐఐటీ ఢిల్లీ అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష 2027 మే 23న జరగనున్నట్లు తెలిపింది. మెయిన్ పరీక్షలో అత్యధిక స్కోరు సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపింది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ https://jeeadv.ac.in/index.htmlను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 10-12 అంకెల (నాన్-సైంటిఫిక్) కాలిక్యులేటర్‌ను స్క్రీన్‌పై అందుబాటులోకి ఉంచనున్నట్లు పేర్కొంది.