జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఎన్టీఏ తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 13.29 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 11.19 లక్షల మంది దరఖాస్తు పూర్తి చేశారు. ఈ నెల 22 (ఆదివారం) అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఆలస్య రుసుముతో నవంబర్ 26 వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఫీజు చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి. జనవరి 20-24, 28 తేదీల్లో
పరీక్షలు జరగనున్నాయి. వివరాలకు వెబ్సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.