ప్రముఖ టెలికాం సంస్థ
రిలయన్స్ జియో, పదేళ్ల వేడుకల్లో భాగంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.399తో 28 రోజుల పాటు, రూ.3,999తో 365 రోజుల ప్లానలను ప్రకటించింది. ఈ ప్లాన్ల ద్వారా వినియోగదారులకు అపరిమిత 4జీ, 5జీ డేటా, కాల్స్‌తో పాటు కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్,
జియో హాట్‌స్టార్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. వాటితో పాటు 1, 2 రోజుల వాలిడిటీ కోసం రూ.15, రూ.25 ప్లాన్లను ప్రకటించింది.