
భర్త, పిల్లలతో కలిసి యూట్యూబర్ మధుమిత పరార్
ప్రముఖ యూట్యూబర్ మధుమితపై చోరీ కేసు నమోదైంది. తన 5 సవర్ల బంగారు గొలుసును మధుమిత దొంగిలించిందని తిరునెల్వేలికి చెందిన కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి, పోలీసుల దర్యాప్తుకు భయపడి మధుమిత తన భర్త, పిల్లలతో కలిసి ఇంటికి తాళం వేసి పరారైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, గతంలో ఆమె ఇంట్లో 118 సవర్ల నగలు చోరీకి గురైన సంగతి తెలిసిందే.




