ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆధార్ కేవైసీ ప్రక్రియ మరింత సులభతరం
Sep 27, 2026, 15:09 IST/

ఆధార్ కేవైసీ ప్రక్రియ మరింత సులభతరం

Sep 27, 2026, 15:09 IST
ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి యూఐడీఏఐ కొత్త ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌లలోకి మారాల్సిన అవసరం లేకుండా, ఇకపై బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాప్‌లలోనే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల సింగిల్ యాప్‌లోనే కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ కొత్త ఫీచర్ డిజిటల్ కేవైసీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్ నెస్ ఫీచర్లు నకిలీ ఫోటోలు, వీడియో మోసాలను అరికడతాయి.