
హైదరాబాద్ U-19 జట్టులో మీర్పేట్ అమ్మాయికి చోటు!
TG: హైదరాబాద్లోని మీర్పేట్కు చెందిన యువ క్రికెటర్ అక్కి ఆశ్రిత గౌడ్, బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే U-19 మహిళల టీ20 టోర్నీకి హైదరాబాద్ జట్టులో స్థానం సంపాదించుకుంది. చిన్నతనం నుంచే కఠోర సాధన చేసిన ఆశ్రిత, తన ఆల్రౌండ్ నైపుణ్యాలతో సెలెక్టర్లను ఆకట్టుకుని జట్టుకు ఎంపికైంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకోవడంతో మీర్పేట్ ప్రాంతవాసులు, కుటుంబ సభ్యులు, కోచ్లు హర్షం వ్యక్తం చేశారు.




