రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత పర్యటన

0చూసినవారు
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం రాజమండ్రిలో పర్యటించారు. కృష్ణా నదీ జలాల తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం నిర్లక్ష్యం వల్లే ఏపీ ప్రభుత్వం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కృష్ణా నీటిని తరలించుకుపోతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని విమర్శిస్తూ, అపెక్స్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం చట్టబద్ధంగా నీటి పంపకాలు జరగాలని, అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్