అగ్రనటుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'సాండియార్' ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.