
అలా బాధపడితే నేను 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి: బండ్ల గణేశ్
హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన 'తెల్ల కాగితం' సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ, 'నీలాగా నేను బాధపడితే 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి. పక్కవారి కోసం కాదు.. మనకోసం మనం ఆలోచించాలి. మనం ఉన్నత స్థాయికి ఎదిగేందుకే నిరంతరం కష్టపడాలి' అని దర్శకుడికి ధైర్యం చెప్పారు. జీవితంలో మనకోసం మనం బతకాలని, పక్కవారి కోసం కాదని ఆయన అన్నారు.
































