
బాన్సువాడ లో మాల మహానాడు నిరాహార దీక్ష
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో శుక్రవారం మాల సంఘం ఆధ్వర్యంలో రోస్టర్ సవరణ మరియు రద్దు కోరుతూ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బంగారు మైషయ్య, దేశాయ్ పేట్ ప్రశాంత్, మన్నే చిన్న సాయిలు, నెర్రే నర్సింలు సహా పలువురు పాల్గొని మద్దతు తెలిపారు. రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ధర్నాలో గైని ప్రవీణ్, లింగం, నాగభూషణం వంటి పలువురు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.


































