
బీజేపీ కామారెడ్డి జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీగా రాథోడ్ సునీత నియామకం
కామారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీగా రాథోడ్ సునీత నియమితులయ్యారు. బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఆదేశాల మేరకు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పావని రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా మోర్చాను మరింత బలోపేతం చేస్తానని రాథోడ్ సునీత తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.































