Sep 19, 2026, 07:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ముత్యంపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
Sep 19, 2026, 07:09 IST
దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, ఔషధాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులకు సకాలంలో మందులు అందించాలన్నారు.