తాడ్వాయి మండలం - Thadvai Mandal

కామారెడ్డి జిల్లా
ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛతా హి సేవపై అవగాహన
Sep 19, 2026, 05:09 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి

ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛతా హి సేవపై అవగాహన

Sep 19, 2026, 05:09 IST
నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ఎంపీడీవో గంగాధర్, సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్, జిపి సెక్రెటరీ వెంకట్ రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వచ్ఛతా హి సేవలో భాగంగా విద్యార్థులు చెత్తను, తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్స్ వ్యర్దాల సానిటరీ నాప్కిన్స్ వ్యర్దాలని నాలుగు రకాలుగా వేరు చేసి చెత్త నిర్వహణ చేపట్టి పాఠశాల పరిసరాలను ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణతో పరిసరాల పరిశుభ్రతను పెంపొందించవచ్చు.