Sep 25, 2026, 02:09 IST/చొప్పదండి
చొప్పదండి
కోనేరుపల్లి, కాట్నపల్లిలో శ్రమదానం
Sep 25, 2026, 02:09 IST
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా చొప్పదండి మండలం కోనేరుపల్లి, కాట్నపల్లి గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం సాధ్యం అవుతుందని, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన జలసిరి పనులు చేపట్టి ఎల్నినో పరిస్థితుల నుండి బయట పడాలని కోరారు. ఎంపీడీవో వేణుగోపాలరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సర్పంచులు రాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.