Sep 05, 2026, 16:09 IST/
సెప్టెంబర్ 6న మహాధర్నా.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
Sep 05, 2026, 16:09 IST
TG: హైదరాబాద్లో సెప్టెంబర్ 6న నిర్వహించనున్న మహాధర్నా, పాదయాత్రలు, ట్యాంక్బండ్పై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధర్నాచౌక్, ఇందిరాపార్క్, లిబర్టీ, బషీర్బాగ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. సచివాలయం, ట్యాంక్బండ్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీని గమనించి, ప్రయాణాన్ని ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.