
చొప్పదండిలో భూభారతి సర్వేపై అవగాహన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో శుక్రవారం భూభారతి రీసర్వే ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు భూముల సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామస్తులకు వివరించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



























