
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మన్ ఖాన్పేటకు చెందిన జివ్వాజి రాధాకృష్ణ(21) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి తన మిత్రుడు సాయిచరణ్తో కలిసి పెద్దాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని బైక్ మీద తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాధాకృష్ణ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రాధాకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


























