Oct 15, 2026, 10:10 IST/
రైతు బీమా ఇవ్వకుంటే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం: హరీశ్ రావు
Oct 15, 2026, 10:10 IST
TG: రైతు బీమా ఇవ్వకుంటే బాధిత కుటుంబాలతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటిని, సెక్రటేరియట్ను ముట్టడిస్తామని మాజీమంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. గురువారం బాధిత రైతు కుటుంబాలతో మాట్లాడారు. 'ఆగస్టు 15 నుండి ఇప్పటి వరకు ఒక్క సిద్ధిపేట నియోజకవర్గంలోనే 22 మంది రైతులు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 మంది రైతులు చనిపోయారు. వీరి కుటుంబాలకు ఇప్పటివరకూ రైతు బీమా అందలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ బాధిత కుటుంబాలకు రైతు బీమా ఇచ్చి ఆదుకోవాలి' అని డిమాండ్ చేశారు.