Sep 25, 2026, 01:09 IST/
వరి కోతలు: సన్న ధాన్యానికి రికార్డు ధరలు, రైతుల మొగ్గు
Sep 25, 2026, 01:09 IST
TG: ఖరీఫ్ సీజన్లో వరి కోతలు ప్రారంభం కావడంతో సన్న ధాన్యానికి మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 20-30% తేమ ఉన్నా పచ్చి ధాన్యానికి ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్కు రికార్డు స్థాయిలో రూ.2,950 వరకు చెల్లిస్తున్నారు. దీంతో నిజామాబాద్ వంటి ప్రాంతాల రైతులు ప్రైవేటు వ్యాపారులకే తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గత మూడు నెలల్లో కేజీ బియ్యం ధర రూ.10-13 పెరగగా, నాణ్యమైన సన్న బియ్యం ధర కేజీకి రూ.73-75కు చేరింది.