Sep 08, 2026, 11:09 IST/చొప్పదండి
చొప్పదండి
చొప్పదండి: రైతు వేదికలో రైతులతో సమావేశం
Sep 08, 2026, 11:09 IST
కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని రైతువేదికలో మంగళవారం శాస్త్రీయ పద్ధతుల్లో పట్టు పరిశ్రమలను ప్రోత్సహించడం, కొత్త రైతులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా కేంద్ర పట్టుమండలి, రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సంయుక్తంగా ఒక సమావేశాన్నిమంగళవారం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పట్టు మండలి శాస్త్రవేత్త గులాబ్ ఖాన్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వెంకన్న, మండల వ్యవసాయ అధికారి మమత, ఏఈవోలు రమ్య జ్యోత్స్న, సంపత్ పాల్గొన్నారు. రైతులను పట్టు పరిశ్రమ వైపు ఆకర్షించేందుకు పలు అంశాలపై చర్చించారు.