Oct 10, 2026, 12:10 IST/
మోదీ, RSSతో పోరాడుతున్నా: రాహుల్
Oct 10, 2026, 12:10 IST
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, RSS చీఫ్ మోహన్ భగవత్లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 'పదేళ్లుగా మోదీ, ఆర్ఎస్ఎస్తో పోరాడుతున్నా. వారి అసలు స్వరూపం నాకు తెలుసు, ఎంత మంది పోలీసులను మోహరించినా, 50 వేల మందిని పిలిపించినా వెనక్కి తగ్గేది లేదు. యువతను, నాయకులను అరెస్ట్ చేసినా పోరాటం ఆగదు. రాజ్యాంగాన్ని, ప్రజల గొంతుకను కాపాడుతాం. యువత నిరసనలు కొనసాగించాలి. మేము అండగా ఉంటాం' అని భరోసా ఇచ్చారు.