
మెడికల్ కాలేజీలో త్వరలోనే మౌలిక వసతులు: మంత్రి అడ్లూరి
జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పనులు, మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత రెండు రోజుల క్రితం కళాశాల నిర్మాణ పనులు, మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థుతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు గాజంకి నందయ్య, చైర్పర్సన్ సామ్మిల్లవాణి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.






































