స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

3222చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యవార్ రోడ్డులో మంగళవారం ఆర్టీసీ అద్దె బస్సు, ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు బ్రేకులు పడకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ఘటన సమయంలో స్కూల్ బస్సులో 26 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్