Sep 07, 2026, 17:09 IST/కరీంనగర్
కరీంనగర్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్
Sep 07, 2026, 17:09 IST
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సోమవారం ఏసీబీ అధికారులు సబ్ జైలర్ నాంపల్లి దేవేందర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్లను రూ. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రిమాండ్ ఖైదీకి మెరుగైన వసతులు, ములాఖాత్లు కల్పించడంతో పాటు ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ, డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. వీరిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.