కోరుట్ల - Korutla

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన రిటైర్డ్ ఏఎస్ఐ

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన రిటైర్డ్ ఏఎస్ఐ

మానవత్వమే బంధుత్వంగా భావించి రిటైర్డ్ ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆదర్శంగా నిలిచారు. తొమ్మిది నెలల క్రితం మతిస్థిమితం లేని స్థితిలో రోడ్లపై తిరుగుతున్న శ్రీనివాస్‌ను జగిత్యాలలోని శివ గాయత్రి అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించారు. బుధవారం ఆయన మృతి చెందడంతో రాజేశుని శ్రీనివాస్ చింతకుంట శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ వృద్ధులకు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలను వృద్ధుల సమక్షంలో జరుపుకొని వారికి భోజనం అందించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మానవతా సేవలను ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధులు అభినందించారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా