Sep 16, 2026, 05:09 IST/
భారత ఆర్మీ శునకాలతో తొలిసారి పారాచూట్ జంపింగ్ (వీడియో)
Sep 16, 2026, 05:09 IST
భారతీయ ఆర్మీ తొలిసారిగా సుశిక్షిత శునకంతో కలిసి పారాచూట్ జంపింగ్ నిర్వహించింది. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్లో ఒక ఆర్మీ పారాట్రూపర్, డాగ్ హ్యాండ్లర్‌తో కలిసి పూర్తి కంబాట్ లోడ్‌తో విమానం నుంచి విజయవంతంగా దూకారు. సైనికుడు, శునకం మధ్య ఉన్న అసాధారణ అనుబంధాన్ని ఈ విన్యాసం చాటిచెప్పిందని సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా నేవీ సీల్స్ కూడా ఒసామా బిన్ లాడెన్ ఆపరేషన్ వంటి ఎయిర్‌బార్న్ మిషన్లలో ఇటువంటి శునకాలను ఉపయోగిస్తాయని పేర్కొంది.