Oct 06, 2026, 17:10 IST/కరీంనగర్
కరీంనగర్
అమరుల యాదిలో కార్యక్రమానికి హాజరైన విమలక్క
Oct 06, 2026, 17:10 IST
కరీంనగర్ జిల్లా, చందుర్తి మండలం సనుగుల గ్రామంలో మంగళవారం జరిగిన అమరుల యదిలో కార్యక్రమానికి అరుణోదయ కళాకారిణి విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరుడు ఈడుగు శంకరయ్యతో పాటు పలువురు అమరులకు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం రామారావు పల్లె గ్రామంలో అమరుడు శ్రీరాముల వెంకట్ (అలియాస్ విఠల్) కుమారుడు శ్రీనివాస్ను పరామర్శించి, ఆయన కుటుంబానికి అండగా ఉంటానని విమలక్క భరోసా ఇచ్చారు.