
శంకరపట్నంలో రెండో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.. బక్కి అనిల్ కుమార్
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా రెండో వాటర్ ప్లాంట్ నిర్మించాలని గ్రామస్థులు బక్కి అనిల్ కుమార్, గోదారి లక్ష్మణ్, దుర్గం బిక్షపతి కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఎస్వీబీసీ కాలనీ సమీపంలో లేదా ఎస్సీ, బీసీ కాలనీలలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వేసవి ప్రారంభానికి ముందే అధికారులు తగిన చర్యలు చేపట్టి నీటి కొరతను నివారించాలని వారు కోరారు.

























