ముస్తాబాద్ మండలం - Mustabad Mandal

కరీంనగర్ జిల్లా
Sep 11, 2026, 15:09 IST/

చదువే తలరాత మారుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి (వీడియో)

Sep 11, 2026, 15:09 IST
తెలంగాణలో ప్రపంచస్థాయి విద్యా విధానాన్ని అమలు చేయాలని, విద్యతో పాటు నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యమిస్తూ, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాలను అందుబాటులోకి తెచ్చి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు 'విద్యా కమిషన్' ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో విద్యాశాఖకు కేటాయింపులను పెంచుతూ బడ్జెట్‌లో 15 శాతం నిధులు ఇవ్వడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 24,966 ప్రభుత్వ పాఠశాలలు, 444 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయని సీఎం వివరించారు.