Oct 13, 2026, 06:10 IST/
అమెరికాలో ఆర్థిక సంక్షోభం.. భారత్కు వస్తున్న NRIలు
Oct 13, 2026, 06:10 IST
అమెరికాలో ఆర్థిక సంక్షోభం, H-1B వీసా నిబంధనల కఠినతరం, I-140 పిటిషన్ల తిరస్కరణ వంటి కారణాలతో భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులు, ముఖ్యంగా తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, భారీ అద్దెలు, పెరిగిన వడ్డీ రేట్లతో ఇళ్లు, కార్లు అమ్ముకోలేక, దిక్కుతోచని స్థితిలో రాత్రికి రాత్రే భారత్కు తిరిగి వస్తున్నారు. ఒకప్పుడు కోటి రూపాయల వేతనం అందుకున్నవారు ఇప్పుడు 35 లక్షల ప్యాకేజీతో సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి 2008 ఆర్థిక మాంద్యాన్ని తలపిస్తోందని ప్రవాస సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.