
దంపతుల అనుమానాస్పద మృతి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలు అజయ్ (28), అతని భార్య దినేశ్వరి (25) గంటల వ్యవధిలో మృతి చెందారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అజయ్, ఆసుపత్రిలో దినేశ్వరి మరణించారు. అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.











