
ఓసీపీ-5లో రికార్డు స్థాయి బొగ్గు రవాణా
గోదావరిఖని సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని ఓసీపీ-5 ఒకే రోజులో 14, 616 టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసి కొత్త రికార్డు సాధించింది. రోజువారీ లక్ష్యం 9, 666 టన్నులు కాగా, దానిని అధిగమించింది. ఈ సందర్భంగా ఆర్జీ-1 జీఎం డి. లలిత్ కుమార్ గని అధికారులు, ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. రమేష్, ఎస్ఓఎం డి. రమేష్ బాబు, అదనపు మేనేజర్ గంధం రాములు, పిట్ సెక్రటరీ జి. ప్రభుదాస్ తదితరులు ఈ విజయానికి కృషి చేశారు.




















