Sep 05, 2026, 17:09 IST/కరీంనగర్
కరీంనగర్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
Sep 05, 2026, 17:09 IST
కరీంనగర్ జిల్లాలోశనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్లో ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, విద్యాభిమానులు పాల్గొని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. దశరథం, శంకర్, రామయ్య, అంజయ్య, వెంకటేశ్వర్లు, మనోహర్, మొండయ్య తదితరులు సన్మానం అందుకున్నారు.