Oct 13, 2026, 16:10 IST/కరీంనగర్
కరీంనగర్
ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి సత్కారం
Oct 13, 2026, 16:10 IST
కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని వీణవంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఆవుల తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ నెల్లి మోహన్, కానిస్టేబుళ్లు గిన్నారపు రవి, నల్ల కోమల్, కుర్రే ప్రవల్లికలకు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌరవ గౌస్ ఆలం ఐపీఎస్ మంగళవారం ప్రశంసా పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవలు అందించిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.