Sep 21, 2026, 11:09 IST/చొప్పదండి
చొప్పదండి
గోపాల్ రావు పేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
Sep 21, 2026, 11:09 IST
తెలంగాణ ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత అండగా నిలిచారని రామడుగు తాహసిల్దార్ దాసరి రాజమల్లు అన్నారు. గోపాల్ రావు పేట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అల్వాల విష్ణు, కొలిపాక కమలాకర్, సర్పంచ్ ఎడవల్లి వనజ నరేందర్ రెడ్డి, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు కొలిపాక మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.