
వల్భాపూర్ గ్రామ సర్పంచ్ గా అందె శ్రీమతి కుమార్ ప్రమాణ స్వీకారం
వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో నూతన ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా అందె శ్రీమతి కుమార్ విజయం సాధించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాకుండా వార్డు సభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించడంతో నూతన పాలకవర్గం కొలువుదీరింది.











