Sep 08, 2026, 13:09 IST/
రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యాసిడ్ దాడి బాధితురాలు
Sep 08, 2026, 13:09 IST
ప్రేమ పేరుతో ఓ దుర్మార్గుడి యాసిడ్ దాడిలో ఒక కన్ను కోల్పోయి, మరో కన్ను పాక్షికంగా చూపు కోల్పోయిన కాజల్ ప్రజాపతి, పట్టుదలతో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అహ్మదాబాద్లోని మెహసానాకు చెందిన రిక్షా డ్రైవర్ కుమార్తె అయిన కాజల్, 2016లో జరిగిన యాసిడ్ దాడి తర్వాత 20కి పైగా సర్జరీలు చేయించుకుంది. ఆర్థిక ఇబ్బందులున్నా, ప్రభుత్వ లైబ్రరీపై ఆధారపడి చదువుకుని, గ్రామీణ పరిపాలనా కార్యదర్శి, డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలను సాధించింది.