
ఉరేసుకొని వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అవధూత సుమన్ (40) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, పలువురికి జీవనాధారంగా నిలిచిన ఆయన మృతితో గ్రామస్థులు, బీడీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.































