Sep 18, 2026, 15:09 IST/
అలా చేస్తే మా ఆస్తులన్నీ రాసిస్తాం.. సీఎంకు KTR సవాల్
Sep 18, 2026, 15:09 IST
TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల భూములు ఉన్నాయని సీఎం చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సీఎంకు సవాల్ విసురుతూ, తమకున్న ఆస్తులన్నీ రాసిస్తామని, అందుకు బదులుగా రాష్ట్రంలోని పేదల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే, తన పిచ్చి ప్రచారాన్ని మానుకొని, వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.