Sep 12, 2026, 14:09 IST/
బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని చిల్లర రాజకీయ ప్రచారం చేశారు: హరీష్ రావు
Sep 12, 2026, 14:09 IST
TG: ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించడాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.19,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కు ఇచ్చామని, కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతోందని ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తే బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనంటూ ప్రచారం చేయడం చిల్లర రాజకీయమని, కాంగ్రెస్ వైఖరిని హరీశ్ రావు ఎండగట్టారు.