తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కృష్ణానది ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, మూడేళ్లుగా రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. వచ్చే 10 నెలలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోబోతున్నామని, ఎల్ నినోపై రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత, పాలకుడు అందరినీ సమానంగా చూడాలని, కానీ రేవంత్ రెడ్డికి ఆ దృష్టి లేదన్నారు.