
ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. వీడియో వైరల్
చండీగఢ్‌కు చెందిన ఓషీన్ పాండ్యా ఆఫీస్ దీపావళి వేడుకల్లో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2012లో వచ్చిన ‘ఇషక్జాదే’ సినిమాలోని ‘ఝల్లా వల్లా’ పాటకు ఆమె ఉత్సాహంగా స్టెప్పులేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఏకంగా 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె డ్యాన్స్, చిరునవ్వు, పండుగ ఉత్సాహం నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ‘ఆమె ఆఫీస్ క్రష్‌గా మారిపోయింది’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.




